HBD Sai Pallavi : సాయిపల్లవి ఉగ్రరూపం..!
అందంతో కన్నా అభినయంతో ప్రేక్షకులకి బాగా దగ్గరైంది కేరళ కుట్టి సాయిపల్లవి.. ఫిదా సినిమాతో అందర్నీ ఫిదా చేసిన ఈ భామ నేడు పుట్టినరోజు జరుపుకుంటుంది.;
అందంతో కన్నా అభినయంతో ప్రేక్షకులకి బాగా దగ్గరైంది కేరళ కుట్టి సాయిపల్లవి.. ఫిదా సినిమాతో అందర్నీ ఫిదా చేసిన ఈ భామ నేడు పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె తాజాచిత్రం శ్యామ్ సింగ రాయ్ నుంచి ఆమె లుక్ ని విడుదల చేశారు మేకర్స్.. కాళికాదేవి అవతరంలో సాయి పల్లవి ఉగ్రరూపం దాల్చినట్టుగా ఉంది. ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
'టాక్సీవాలా' డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తుండగా, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో శ్యామ్ సింగరాయ్ చిత్రం తెరకెక్కుతుంది. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.