samantha ruth prabhu: ఎన్టీఆర్‌తో సామ్.. విడాకుల తర్వాత మొదటిసారి..!
samantha ruth prabhu: గతకొద్దిరోజులుగా వస్తున్న వదంతులని తెరదించుతూ అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టుగా ప్రకటించారు.;
samantha ruth prabhu: గతకొద్దిరోజులుగా వస్తున్న వదంతులని తెరదించుతూ అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టుగా ప్రకటించారు. ఈ క్రమంలో వీరికి సంబంధించిన ఏ న్యూస్ ఐన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరూ ఎవరి పనుల్లో వారున్నారు. ఇప్పటికే నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో ఉండగా, త్వరలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా కూడా కనిపించబోతున్నాడు.
ఇక అటు సమంత విడాకుల తర్వాత నేరుగా ఎక్కడ కనిపించని సమంత.. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కనిపించబోతోంది అంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. ఆమెకు సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు షూటింగ్ పూర్తి అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల చివరలో లేదా వచ్చే నెల మొదటి వారంలో టెలికాస్ట్ అవుతుందని సమాచారం.
కాగా ఇప్పటికే ఈ షోకి రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, మహేష్ బాబు వచ్చారు. మహేష్ బాబుకి సంబంధించిన ఎపిసోడ్ ని దసరాకు ప్రసారం అవుతుందని టాక్.. దీనికి సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేశారు.