Samantha Ruth Prabhu: సమంత కోసం స్పెషల్ నోట్ షేర్ చేసిన నటి..
Samantha Ruth Prabhu: సమంత కోసం ఓ నటి స్పెషల్ నోట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.;
Samantha Ruth Prabhu: తన పర్సనల్ లైఫ్‌లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. వాటి వల్ల ప్రొఫెషన్‌లో ఇబ్బంది కలగకుండా చూసుకుంటోంది సమంత. ఇప్పటికే సమంతపై సోషల్ మీడియాలో నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోయినా.. తాను అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్తోంది. అయితే అలాంటి సమంత కోసం ఓ నటి స్పెషల్ నోట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సీనియర్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. కెరీర్ మొదట్లో హీరోయిన్‌గా నటించినా.. తనకు బ్రేక్ వచ్చింది మాత్రం విలన్ పాత్రల వల్లే. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ చిత్రాల్లో తెగ బిజీ అయిపోయిన వరలక్ష్మి.. ప్రస్తుతం సమంతతో కలిసి 'యశోద' అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాలో తనవంతు షూటింగ్ పూర్తయ్యింది.
'టీమ్ యశోదకు చాలా పెద్ద థ్యాంక్స్. నా షూటింగ్ పూర్తయ్యింది. మీ అందరితో షూటింగ్ చేయడం అదిరిపోయింది. ప్రేక్షకులకు ఈ సినిమా చూపించడం కోసం ఎదురుచూస్తున్నాను. చాలా బాగున్నందుకు సమంతకు థ్యాంక్స్.' అంటూ సమంతను, యశోద టీమ్‌ను ట్యాగ్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇక ఈ సినిమా ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.