Samantha In Hyderabad : మకాం మార్చలేదు... అక్కడే ఫ్లాట్ కొనేసిన సమంత...!

Samantha In Hyderabad : గతకొద్దిరోజులుగా వస్తున్న వదంతులని తెరదించుతూ అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టుగా ప్రకటించారు.

Update: 2021-10-06 10:00 GMT

Samantha In Hyderabad : గతకొద్దిరోజులుగా వస్తున్న వదంతులని తెరదించుతూ అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టుగా ప్రకటించారు. ఈ క్రమంలో సమంతకి సంబంధించిన ఏ న్యూస్ ఐన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె గురించి వచ్చే ఏ అప్డేట్ ఐన ఆసక్తిని కలిగిస్తుంది. విడాకుల అనంతరం ఇప్పుడు సామ్ ఎక్కడ ఉండబోతుందన్నది హాట్ టాపిక్ గా మారింది. గతంలో ముంబయికి సమంత మకాం మార్చేస్తుందని రూమర్స్ వచ్చాయి కానీ వాటికి ఆమె చెక్ పెట్టింది. హైదరాబాద్‌ నా హోమ్‌టౌన్‌.. ఇప్పటికీ.. ఎప్పటికీ అంటూ చెప్పుకొచ్చింది. తాజా సమాచారం మేరకు సమంత హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఫ్లాట్‌ ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడే ఆమె ఉంటుందని సమాచారం. అటు సామ్ సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం ఆమె తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో నటిస్తోంది. ఇక తమిళ్ లో కాదల్ చిత్రంలో నటిస్తోంది. 

Tags:    

Similar News