Bazaar Rowdy Movie Teaser : రౌడీయిజం చేయాలంటే కావాల్సింది జీపులు కాదు.. దమ్ము..!
రౌడీయిజం చేయాలంటే జీపు, జీపులో పెట్రోల్.. దాంట్లో రౌడీలు కాదురా.. దమ్ము.. దమ్ముకావాలి అంటున్నాడు హీరో సంపూర్ణేశ్ బాబు.. సంపూ ప్రధాన పాత్రలో బజార్ రౌడీ అనే చిత్రం తెరకెక్కుతుంది.;
రౌడీయిజం చేయాలంటే జీపు, జీపులో పెట్రోల్.. దాంట్లో రౌడీలు కాదురా.. దమ్ము.. దమ్ముకావాలి అంటున్నాడు హీరో సంపూర్ణేశ్ బాబు.. సంపూ ప్రధాన పాత్రలో బజార్ రౌడీ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. టీజర్‌లో సంపూ చెప్పే పంచ్ డైలాగులు నవ్వు తెప్పిస్తున్నాయి.
సీరియస్ కామెడీతోపాటు రొమాన్స్ కూడా ఇందులో పుష్పలంగా ఉన్నట్టు టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. సంపూతో పాటుగా షియాజీ షిండే, పృథ్వి, నాగినీడు, షఫి, జీవ, సమీర్, మణిచందన, నవీన, పద్మావతి వంటి వారు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని కేఎస్ క్రియేషన్స్ పతాకంపై సందిరెడ్డి శ్రీనివాస్‌రావు నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ దీనికి సంగీతం అందిస్తున్నారు. సినిమా పైన మంచి అంచనాలున్నాయి.