Sekhar Master: హీరోయిన్‌గా శేఖర్ మాస్టర్ కూతురి ఎంట్రీ.. ప్లాన్ రెడీ..
Sekhar Master: చిన్న బుల్లితెర డ్యాన్స్ షో నుండి వెండితెరపై స్టార్ హీరోలకు కొరియోగ్రాఫీ చేసేవరకు వెళ్లాడు శేఖర్ మాస్టర్.;
Sekhar Master: ఒకప్పుడు నిర్మాతలుగా, దర్శకులుగా ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించిన వారు కూడా తమ వారసులను హీరోలుగా, హీరోయిన్లుగా పరిచయం చేయాలని అనుకుంటున్నారు. దానికి వారి పరిచయాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఇక తాజాగా టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అయిన శేఖర్ మాస్టర్ కూడా తన కూతురిని హీరోయిన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అంతే కాదు దీనికి తగిన ప్లాన్ కూడా ఇప్పటికే సిద్ధమయ్యిందట.
ఒక చిన్న బుల్లితెర డ్యాన్స్ షో నుండి వెండితెరపై స్టార్ హీరోలకు కొరియోగ్రాఫీ చేసేవరకు వెళ్లాడు శేఖర్ మాస్టర్. ఇప్పుడు ప్రతీ స్టార్ హీరో సినిమాలో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన పాట ఒక్కటైన ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలోని బిజీ కొరియోగ్రాఫర్స్‌లో శేఖర్ మాస్టర్ పేరు ముందుంటుంది. ఇక సమయం కుదిరినప్పుడల్లా తన కూతురు, కొడుకును కూడా స్క్రీన్‌పై చూపించి ప్రేక్షకులకు పరిచయం చేశాడు శేఖర్ మాస్టర్.
ఇప్పటికే శేఖర్ మాస్టర్ తన కొడుకు విన్నీని 'అంటే సుందరానికీ' చిత్రంతో నటుడిగా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక తర్వాత తన కూతురు సాహితీ వంతు. ఇప్పటికే సాహితీ డ్యాన్స్‌లో, ఎక్స్‌ప్రెషన్స్‌లో బెస్ట్ అని సోషల్ మీడియా ద్వారా అర్థమయ్యింది. అయితే సాహితీ డెబ్యూ కోసం ఇటీవల ఓ యంగ్ డైరెక్టర్.. శేఖర్ మాస్టర్‌కు కథ వినిపించగా.. తాను కూడా ఓకే చేశాడట. అంతే కాకుండా ఓ యంగ్ హీరోను సాహితీతో నటించడానికి ఒప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడట.