శివరాత్రి కానుకగా శర్వానంద్ 'శ్రీకారం'
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీకారం.. శర్వానంద్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.;
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీకారం.. శర్వానంద్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కిశోర్ బి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుగా తీసుకువచ్చేందుకు చిత్ర బృందం రెడీ అయిపొయింది. ఈ మేరకు రిలీజ్ డేట్ ని అనౌన్సు చేస్తూ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. బుర్రా సాయిమాధవ్ ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తుండగా.. జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు.