Tollywood: టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్.! కారణం ఏంటంటే..?
Tollywood: తమ రెమ్యునరేషన్లు పెంచాల్సిందేనని సినీ కార్మికులంతా డిమాండ్ చేస్తూ నిరవధికంగా సమ్మెలోకి వెళ్లబోతున్నారు.;
Tollywood: రేపట్నుంచి టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్ అవబోతున్నాయి. తమ రెమ్యునరేషన్లు పెంచాల్సిందేనని సినీ కార్మికులంతా డిమాండ్ చేస్తూ నిరవధికంగా సమ్మెలోకి వెళ్లబోతున్నారు. ఫెడరేషన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు 24 క్రాఫ్ట్స్ సభ్యులు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రేపు ఫెడరేషన్ ముట్టడికి కూడా పిలుపిచ్చారు. కరోనా కారణంగా 3 ఏళ్లుగా రెమ్యునరేషన్లపై నిర్ణయం తీసుకోలేదని, ఇప్పుడు కూడా ఇంకా నాన్చుడు ధోరణితో ఉన్నందునే తాము సమ్మె దిశగా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు యూనియన్ నేతలు చెప్తున్నారు.