Shruti Haasan : అమ్మానాన్న విడిపోయాకే సంతోషంగా ఉంటున్నారు..!
Shruti Hassan : విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నటి శృతిహసన్... కేవలం నటిగానే కాకుండా సింగర్, డ్యాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది.;
Shruti Hassan : విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నటి శృతిహసన్... కేవలం నటిగానే కాకుండా సింగర్, డ్యాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఏ విషయానైనా సుత్తి లేకుండా మాట్లాడే శృతిహాసన్ తాజాగా ఆమె తల్లితండ్రులువిడిపోవడం గురించి స్పందించింది. "అమ్మానాన్న విడిపోవడం నాకు సంతోషంగా ఉంది.. ఇద్దరికీ ఇష్టం లేకుండా ఏవేవో కారణాలు చెప్పి కలిసుండడం కరెక్ట్ కాదు. వారిద్దరూ అద్భుతమైన వ్యక్తులు. నా చిన్నతనంలోనే వారిద్దరూ విడిపోయారు. కలిసి ఉన్నప్పటికంటే కూడా విడిపోయాకే వారు హ్యాపీగా ఉంటున్నారు" అని శృతిహసన్ తెలిపింది.
కాగా నటుడు కమల్ హాసన్ మొదట డ్యాన్సర్ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు. పదేళ్ళ బంధం తర్వాత వారు 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కమల్ సారికను ప్రేమించి 1980లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 986లో శృతీహాసన్, 1991లో అక్షరహాసన్ జన్మించారు. ఆ తరవాత కమల్, సారికల మధ్య విభేదాలు రావడంతో వీరు 2004లో విడాకులు తీసుకున్నారు. కాగా తమిళ్, తెలుగు సినిమాలతో శృతిహసన్ ఫుల్ బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. అటు అక్షరహాసన్ తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది.