Sitara Ghattamaneni: సితార బర్త్‌డే.. మహేశ్, నమత్ర క్యూట్ విషెస్..
Sitara Ghattamaneni: జులై 20న సితార పుట్టినరోజు సందర్భంగా మహేశ్, నమత్ర సోషల్ మీడియా ద్వారా తనకు క్యూట్ విషెస్ తెలిపారు.;
Sitara Ghattamaneni: టాలీవుడ్‌లోని క్యూట్ కపుల్స్‌లో ఒకరు మహేశ్ బాబు, నమ్రత. ఈ కపుల్‌కు మాత్రమే కాదు.. వీరి ఫ్యామిలీ మొత్తానికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకు కూడా సమానంగా టైమ్ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటారు మహేశ్. అందుకే వీరి ఫ్యామిలీ వెకేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక జులై 20న సితార పుట్టినరోజు సందర్భంగా మహేశ్, నమత్ర సోషల్ మీడియా ద్వారా తనకు క్యూట్ విషెస్ తెలిపారు.
ముందుగా మహేశ్.. సితార గురించి ట్వీట్ చేశారు. 'తెలియకుండానే పూర్తిగా పదేళ్లు గడిచిపోయింది. నా ప్రపంచంలోనే అందమైన తార సితారకు హ్యాపీ బర్త్‌డే. నేను నిన్ను పదిరెట్లు ప్రేమిస్తున్నాను' అని సితార ఫోటోతో తనకు విషెస్ తెలిపారు మహేశ్. ఇక నమ్రత కూడా సితార క్యూట్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విషెస్ అందించారు.
All of 10.. before we even knew it! ♥️♥️♥️ To the brightest star in my world... Happy birthday Sitara!! I love you tenfold 🤗🤗🤗 pic.twitter.com/m693TMYad5
— Mahesh Babu (@urstrulyMahesh) July 20, 2022
'నా లిటిల్ వన్‌కు హ్యాపీ బర్త్‌డే. నువ్వు ఇంక లిటిల్ కాదు. నీ అల్లరి చేష్టలు, నీ ప్రశ్నలు, నీ బోరింగ్ స్టోరీలు.. ఇవన్నీ వచ్చే సంవత్సరానికి కూడా కొనసాగాలని, మన బంధం ఇంకా ఇంకా బలపడాలని కోరుకుంటున్నాను. ఓ కొత్త దశలోకి అడుగుపెడుతున్నందుకు నీకు శుభాకాంక్షలు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు మనసు పెడితే ఏదైనా సాధిస్తావని నాకు తెలుసు. ఐ లవ్ యూ' అని క్యాప్షన్ పెట్టారు నమ్రత.