సబ్ కలెక్టర్‌గా స్టార్ కమెడియన్ కొడుకు..!
చిన్నిజయంత్... ఈ పేరు పెద్దగా టాలీవుడ్ ప్రేక్షకులకి అంతగా తెలిసుండదు కానీ కోలీవుడ్ లో ఈయనో స్టార్ కమెడియన్..;
చిన్నిజయంత్... ఈ పేరు పెద్దగా టాలీవుడ్ ప్రేక్షకులకి అంతగా తెలిసుండదు కానీ కోలీవుడ్ లో ఈయనో స్టార్ కమెడియన్.. అక్కడి స్టార్ హీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, ప్రభు, కార్తీక్, అజిత్, విజయ్ లాంటి హీరోలతో కలిసి ఆయన నటించారు. ఇప్పుడు ఈయన పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవును.. దీనికి కారణం ఆయన కుమారుడు కావడం విశేషం. ఆయన కుమారుడు శృతన్ జై నారాయణన్ ఏకంగా సబ్ కలెక్టర్ కొలువు సంపాదించాడు. శృతన్ జై నారాయణన్ 2020లో ఐఏఎస్ పూర్తి చేశాడు. ఆలిండియా లెవల్లో 75వ ర్యాంకు సాధించాడు. ట్యుటికోరన్ జిల్లాకు సబ్ కలెక్టర్‌గా నియామకమయ్యాడు. ఈ సందర్భంగా ఆయనకి చిన్నిజయంత్ అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. అటు చిన్నిజయంత్ ప్రస్తుతం ఓ తమిళ్ సినిమాలో నటిస్తున్నాడు.