యాక్సిడెంటల్‌గా డైరెక్టరైన విజయబాపినీడుతో బాలు జత ఎలా కుదిరిందంటే?

అలా విజయ బాపినీడు, బాల సుబ్రమణ్యం కాంబినేషన్ కొనసాగింది.. బాల సుబ్రణ్యానికి కొన్ని ప్రయోగాలను చేసే అవకాశం దొరికింది..

Update: 2020-09-25 15:01 GMT

యాక్సిడెంటల్ గా డైరెక్టరైన విజయబాపినీడుతో ఎస్పీ బాల సుబ్రమణ్యంకి జత కుదిరింది. వీరి కాంబినేషలో నాలుగు సినిమాలకు పనిచేసారు. విజయ బాపినీడు అనగానే ఈ జనరేషన్ కి 'గ్యాంగ్ లీడర్' సినిమా గుర్తుకొస్తుంది గానీ, ఆయన మొదట్లో సెంటిమెంట్ ఎమోషనల్ డ్రామాలు తీశారు. లేడీస్ సెంటిమెంట్ తో ప్రేక్షకులను మెప్పించారు. అప్పుడు లేడీస్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న శోభన్ బాబుతో 'భార్యామణి, కొంగుమడి' లాంటి సినిమాలు తీశారు. ఈ రెండిటికి బాలునే సంగీతం చేశారు.

విజయ బాపినీడు దర్శకత్వంలో సుమన్, విజయ శాంతి జంటగా నటించిన 'దొంగల్లో దొర' చిత్రానికి కూడా బాల సుబ్రమణ్యమే సంగీతం అందించారు. మాస్ అప్పీల్ తో వచ్చిన ఈ చిత్రానికి బాలు పాటలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. విజయ బాపినీడుకి పెద్దగా టెక్నీషన్స్ ని మార్చే అలవాటు లేదు. కంపెనీ ఆర్టిస్టుల లాగానే ఆయనకు టెక్నికల్ టీం లో కూడా పెద్ద మార్పులుండవు.. దీంతో విజయ బాపినీడు, బాల సుబ్రమణ్యం కాంబినేషన్ కొనసాగింది. బాల సుబ్రణ్యానికి కొన్ని ప్రయోగాలను చేసే అవకాశం దొరికింది..

Tags:    

Similar News