ఇళయరాజాను బాలు దగ్గరికి పంపిన భారతీరాజా..
ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా.. ఇళయరాజాతోపాటు ఆయన ఇద్దరు సోదరులను బాలు దగ్గరికి పంపించారు;
బాలు గాత్రంలో ఉన్న ప్రత్యేకత, ఆయన నిబద్ధత, పాటలు పాడే తీరు... ఎంతోమంది సంగీతకారులను సన్నిహితులను చేసింది. అలాంటివారిలో ఒకరు ఇళయరాజా. అప్పటిదాకా ఇళయరాజా తన ఇద్దరు సోదరులతో కలిసి ఎన్నో కచేరీలు చేశారు. ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా... ఇళయరాజాతోపాటు ఆయన ఇద్దరు సోదరులను బాలు దగ్గరికి పంపించారంటే ఆయన గాత్రం మహిమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత వీరంతా కలిసి దేశ వ్యాప్తంగా ఎన్నో షోలు నిర్వహించారు. ఇండియన్, క్లాసికల్ మ్యూజిక్‌లలో ఇళయరాజా దిట్ట. ఈ రెండింటిలో ఆయన సొంతంగా సాధన చేశారు. సంగీతమే ఇళయరాజాకు సర్వస్వం.