Vinodhaya Sitham Remake: మెగా హీరోల మల్టీ స్టారర్ కోసం ఇద్దరు యంగ్ బ్యూటీల పోటీ..

Vinodhaya Sitham Remake: పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళ హిట్ మూవీ వినోదాయ సితమ్‌లో నటించనున్నారు.

Update: 2022-06-13 13:15 GMT

Vinodhaya Sitham Remake: ప్రస్తుతం టాలీవుడ్‌లో హవా అంతా యంగ్ బ్యూటీలదే అన్నట్టుగా ఉంది. ఒక సినిమాతో డెబ్యూ చేస్తే చాలు.. తర్వాత వరుస ఆఫర్లు వారిని వెతుక్కుంటూ వస్తున్నాయి. కొన్నిసార్లు వారి డెబ్యూ మూవీ రిజల్ట్ కూడా వారి స్పీడుకు బ్రేకులు వేయలేకపోతోంది. అందుకే తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. తాజాగా ఇద్దరు హీరోల ఒకే సినిమా అవకాశం కోసం పోటీపడుతున్నట్టుగా అనిపిస్తోంది.

ఇంతకు ముందుకంటే ఇప్పుడు మెగా హీరోలు ఎక్కువగా మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఎన్‌టీఆర్‌తో కలిసి రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సూపర్ సక్సెస్ అవ్వడంతో మెగా హీరోలకు మల్టీ స్టారర్‌లపై ఆసక్తి పెరిగినట్టుగా అనిపిస్తోంది. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళ హిట్ మూవీ వినోదాయ సితమ్‌లో నటించనున్నారు. ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్‌కు కూడా డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఇందులో హీరోయిన్లుగా ఇద్దరు యంగ్ బ్యూటీల పేర్లు వినిపిస్తున్నాయి.


'పెళ్లిసందడి' సీక్వెల్‌తో తెలుగుతెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యింది శ్రీలీల. ఆ సినిమాలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ కట్టిపడేసిన ఈ భామ.. ప్రస్తుతం తెలుగులోనే దాదాపు అయిదు సినిమాలతో బిజీగా ఉండగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మల్టీ స్టారర్‌లో సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుందని ఇన్నాళ్లు టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు కూడా తెరపైకి వచ్చింది.


ఆకాష్ పూరీ నటించిన 'రొమాంటిక్' చిత్రంతో హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చింది కేతిక శర్మ. హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రకారును తన ఫ్యాన్స్‌గా మార్చుకుంది. తాను నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మెగా హీరోల మల్టీ స్టారర్‌లో ఛాన్స్ కొట్టేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం మరో మెగా హీరో అయిన వైష్ణవ్ తేజ్‌తో కలిసి 'రంగ రంగ వైభవంగా' అనే చిత్రంలో నటిస్తోంది కేతిక. మరి ఈ ఇద్దరిలో ఎవరు మెగా హీరోల మల్టీ స్టారర్‌లో హీరోయిన్‌గా ఫైనల్ అవుతారో చూడాలి.



Tags:    

Similar News