Srinu Vaitla: టాలీవుడ్‌లో మరో జంట విడాకులకు సిద్ధం.. ఈసారి డైరెక్టర్..
Srinu Vaitla: ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో విడాకులు తీసుకునే సెలబ్రిటీల సంఖ్య చాలా తక్కువగా ఉండేది.;
Srinu Vaitla: ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో విడాకులు తీసుకునే సెలబ్రిటీల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో టాలీవుడ్‌లోనే విడాకుల కేసులు ఎక్కువయిపోతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు సినీ సెలబ్రిటీలు కలిసి జీవించలేక విడాకుల మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ ప్రముఖ దర్శకుడు కూడా విడాకుల బాట పడుతున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.
సీనియర్ డైరెక్టర్లలో కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు శ్రీను వైట్ల. ఒకప్పుడు శ్రీను వైట్ల సినిమా అంటే ఫ్యామిలీ అంతా చూసి నవ్వుకునేవారు. కానీ గత కొన్నేళ్లుగా ఈ దర్శకుడి కెరీర్ సాఫీగా సాగట్లేదు. సీనియర్ హీరో అయినా, యంగ్ హీరో అయినా.. ఎవరితో తెరకెక్కించిన సినిమా అయినా ఫ్లాప్‌గానే నిలుస్తుంది. ఇక తన పర్సనల్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యిందంటూ సమాచారం.
శ్రీను వైట్ల భార్య రూప వైట్ల కూడా సినిమాల్లో డిజైనర్‌గా పనిచేస్తోంది. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయని, అందుకే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతే కాకుండా నాలుగేళ్లుగా శ్రీను వైట్ల, రూపా వైట్ల విడివిడిగానే ఉంటున్నారని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే శ్రీను వైట్లతో విడిపోవాలని నిర్ణయించుకున్న రూపా.. విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించినట్టు సమాచారం.