SSMB 28 Release Date: మహేశ్, త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
SSMB 28 Release Date: త్రివిక్రమ్ సినిమా కోసం మహేశ్ కాస్త గడ్డం కూడా పెంచాడు.;
SSMB 28 Release Date: సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్‌కు ఉండే క్రేజే వేరు. అలాంటి కాంబినేషన్‌లో ఒకటి మహేశ్ బాబు, త్రివిక్రమ్. వీరిద్దరు కలిసి తెరకెక్కించిన సినిమాలు రెండే. అందులో కూడా వీరి కాంబోలో చివరి చిత్రం వచ్చి పది సంవత్సరాలు దాటిపోయింది. అయినా కూడా ఇప్పటికీ ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా వీరి అప్‌కమింగ్ మూవీ రిలీజ్ డేట్ అప్డేట్ బయటికొచ్చింది.
మహేశ్ బాబు చివరిగా 'సర్కారు వారి పాట' చిత్రంలో నటించాడు. ఆ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఆ చిత్రం విడుదల తర్వాత ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లిన మహేశ్.. ఇటీవల మళ్లీ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టాడు. మహేశ్ కోసం రాజమౌళి, త్రివిక్రమ్ ఇద్దరూ లైన్‌లో ఉండగా.. ముందుగా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేద్దామని నిర్ణయించుకున్నాడు మహేశ్ బాబు.
త్రివిక్రమ్ సినిమా కోసం మహేశ్ కాస్త గడ్డం కూడా పెంచాడు. ఇప్పటికే మూవీ సెట్స్ నుండి మహేశ్ లుక్ లీక్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ మళ్లీ అతడు, ఖలేజా రేంజ్ మూవీని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. తాజాగా వీరి కాంబోతో తెరకెక్కుతున్న 'ఎస్ఎస్ఎమ్‌బీ 28' 2023 ఏప్రిల్ 28న విడుదల కానుందని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
The Reigning Superstar will arrive on 28th April 2023! 🔥🤩
— Haarika & Hassine Creations (@haarikahassine) August 18, 2022
Get ready to witness @urstrulymahesh garu in a scintillating Massy look & high octane entertainer ~ #SSMB28 🌟#Trivikram @hegdepooja @MusicThaman @vamsi84
#SSMB28From28April pic.twitter.com/Mux0pWnfan