Sriranganeethulu: సుహాస్ 'శ్రీరంగనీతులు'
కలర్‌ఫోటొ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకున్న నటుడు సుహాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే రైటర్ పద్మభూషన్ సినిమాతో హిట్ కొట్టి చేతినిండా ప్రాజెక్ట్స్‌తో గడిపేస్తున్నాడు యంగ్ టాలెంటెడ్ యాక్టర్;
"కలర్‌ఫోటొ" సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకున్న నటుడు సుహాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే "రైటర్ పద్మభూషన్" సినిమాతో హిట్ కొట్టి చేతినిండా ప్రాజెక్ట్స్‌తో గడిపేస్తున్నాడు యంగ్ టాలెంటెడ్ యాక్టర్. ఈ క్రమంలోనే మరో మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకటేశ్వర రావు బల్మూరి నిర్మాణంలో ప్రవీణ్ కుమార్ వీఎస్‌ఎస్ దర్శకుడిగా రూపు దిద్దుకుంటున్న సినిమా "శ్రీరంగనీతులు". ఈ సినిమాలో సుహాస్‌తో పాటు "కేరాఫ్ కంచెరపాలం" ఫేమ్ కార్తిక్ రత్నం ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
వీరితో పాటు రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు అప్‌డేట్స్ ఎప్పటికప్పడు మేకర్స్ అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృదం విడుదల చేసింది. సుహాస్ ఈ సినిమాతో పాటు ఆనందరావు అడ్వేంచర్స్ అనే టైటిల్‌తో మరో సినిమా కూడా మొదలు పెట్టాడు. ఆ సినిమాకు రామ్ పసుపులేటి దర్శకత్వం వహిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌కు కూడా మంచి స్పందనే లభించింది. అయితే ఈ రెండు సినిమాలు త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.