Sunil: ఆ విషయంలో రాఘవేంద్ర రావు, అనిల్ రావిపూడి ఒకటే: సునీల్
Sunil: ఎఫ్ 3 షూటింగ్ సమయంలో అనిల్ రావిపూడి ఎలా ఉంటాడో బయటపెట్టాడు సునీల్.
Sunil: హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా.. ఇలా ఎన్నో వేరియషన్స్తో, ఎన్నో పాత్రలను పోషించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సునీల్. కమెడియన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే సునీల్ హీరోగా మారాడు. హీరోగా మారిన తర్వాత కూడా ఎక్కువశాతం కామెడీ సినిమాల్లోనే నటించాడు. కానీ ప్రేక్షకులు మాత్రం కమెడియన్ సునీల్‌ను మిస్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఫుల్ లెన్త్ కమెడియన్‌గా 'ఎఫ్ 3'లో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే 'ఎఫ్ 3'. ఇదివరకు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్గా నిలిచిన 'ఎఫ్ 2' సినిమాకు ఇది సీక్వెల్. అయితే ఎఫ్ 3 కోసం మరింత డోస్ పెంచాడు అనిల్ రావిపూడి. అందుకే ఇంతకు ముందు ఉన్న నటీనటులతో పాటు సోనాల్ చౌహాన్, సునీల్‌ను కీలక పాత్రల్లో తీసుకున్నాడు. దీంతో చాలాకాలం తర్వాత సునీల్‌లోని పూర్తి స్థాయి కమెడియన్‌ను ప్రేక్షకులు మరోసారి చూడనున్నారు.
ఎఫ్ 3 షూటింగ్ సమయంలో అనిల్ రావిపూడి ఎలా ఉంటాడో బయటపెట్టాడు సునీల్. అంతమంది స్టార్లను హ్యాండిల్ చేస్తున్నా కూడా అనిల్ ఎప్పుడు కోప్పడలేదు అన్నాడు సునీల్. అంతే కాకుండా యూనిట్‌లోని ప్రతీ ఒక్కరినీ సొంత కుటుంబంలాగా చూసుకునేవాడన్నాడు.
ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మరో సినిమా షూటింగ్‌కు వెళ్లాలని ఆర్టిస్టులు చెప్తే.. డైరెక్టర్స్ చిరాకు పడతారు కానీ.. అనిల్ అలా కాదు అని చెప్పాడు సునీల్. ఇలా ఆర్టిస్ట్ ఇబ్బందిని అర్ధం చేసుకునే దర్శకుడిగా తాను రాఘవేంద్రరావుని చూశానని, ఇప్పుడు అనిల్ రావిపూడిని మాత్రమే చూస్తున్నాని అన్నాడే