తండ్రి బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతోన్న సుస్మిత...!
సుస్మిత కొణిదెల.. చిరంజీవి పెద్దకూతురు. కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా మంచి ఫేం సంపాదించుకుంది. చిరంజీవి నటించిన ఖైది నెంబర్ 150, సైరా చిత్రాలకి ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేసింది.;
సుస్మిత కొణిదెల.. చిరంజీవి పెద్దకూతురు. కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా మంచి ఫేం సంపాదించుకుంది. చిరంజీవి నటించిన ఖైది నెంబర్ 150, సైరా చిత్రాలకి ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేసింది. . ఇటీవల ఆమె తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను స్థాపించింది. ఇదిలావుండగా తన తండ్రి చిరంజీవి(ఆగస్టు 22) పుట్టినరోజు సందర్భంగా ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతోన్నట్టుగా వెల్లడించింది. వెబ్ సిరీస్ తర్వాత తన రెండో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్టుగా ట్విటర్‌లో ఓ టీజర్ విడుదల చేసింది. 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి మీకు మరో ఫన్‌ను అందించబోతున్నామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేంటో డాడీ బర్త్‌డే సందర్భంగా ఆగష్టు 21. 8.2021 తేదీన వెల్లడిస్తాను' అంటూ ట్వీట్ చేసింది. ఈ చిత్రానికి దిమ్మలపాటి ప్రశాంత్ దర్శకత్వం వహించనున్నట్లుగా తెలుస్తుంది.