తగ్గేదే..లే.. మిల్కీ బ్యూటీ భారీ రెమ్యునరేషన్ డిమాండ్..!
Tamannaah Bhatia : ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు అయిన మిల్కీ బ్యూటీ తమన్నా జోరు ఏ మాత్రం తగ్గలేదు... ఒకపక్కా సినిమాలు చేస్తూనే మరోపక్కా ఐటమ్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటుంది.;
Tamannaah Bhatia ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు అయిన మిల్కీ బ్యూటీ తమన్నా జోరు ఏ మాత్రం తగ్గలేదు... ఒకపక్కా సినిమాలు చేస్తూనే మరోపక్కా ఐటమ్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది తమన్నా... దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ చిత్రం. ఇక ఈ సినిమాతో పాటుగా చిరంజీవి హీరోగా, మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తోన్న భోళా శంకర్' సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇందులో నటించేందుకు తమన్నా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.. దాదాపుగా మూడుకోట్ల రెమ్యునరేషన్ తమన్నా డిమాండ్ చేసిందని సమాచారం. ఇందులో సగం మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకుందని టాక్... తాజాగా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది ఈ చిత్రం. ఇందులో కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.