Telugu Indian Idol: పిట్టకొంచెం కూత ఘనం
తెలుగు ఇండియన్ ఐడల్ లో రాణిస్తున్న బాలిక; సార్ పాటతో జీవీ ప్రకాశ్ ప్రశంసలు అందుకున్న ప్రణతి;
మట్టిలో మాణిక్యాలను జల్లెడ పడుతోన్న తెలుగు ఇండయన్ ఐడల్ అచ్చమైన టాలెంట్ ను లోకానికి పరిచయం చేస్తోంది. అహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు సెలబ్రిటీలుగా మారుతున్నారు. తాజాగా 14ఏళ్ల చిరు ప్రాయంలో ఓ చిన్నారి తన గానామృతంతో సంగీత ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన సార్ సినిమాలో నుంచి మాస్టారు మాస్టారు పాట పాడిన ప్రణతి జడ్జిలతో పాటూ శ్రోతలను కూడా సమ్మోహితులను చేసింది. అయితే సార్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ సైతం ప్రణతి పాటకు ముగ్దుడై ఆమెపై ప్రశంసలు కురిపించడం విశేషం. స్వతహాగా సంగీతకారుల కుటుంబం నుంచి వచ్చిన ప్రణతి ప్రతిభకు మెచ్చిన సంగీత దర్శకుడు తమన్ ఆమెతో కలసి పనిచేస్తానని మాట ఇవ్వడం విశేషం. ఏమైనా ప్రణతి ఇదే విధంగా టైటిల్ ను కూడా కైవసం చేసుకోవాలని ఆశిద్దాం.