Akkineni Nagarjuna : తన డ్రీం ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టబోతున్న నాగ్...!
Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున తన డ్రీం ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు. అయితే, ఇది సినిమా అనుకుంటే అది పొరపాటే అవుతుంది.;
Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున తన డ్రీం ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు. అయితే, ఇది సినిమా అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఇంతకీ అదేంటంటే.. మూవీ మ్యూజియం. సినిమాలు చేయటమే కాదు.. వాటిని భద్రంగా కాపాడుకోవడం కూడా బాధ్యతగా భావిస్తున్న నాగ్.. టాలీవుడ్ కు సంబంధించిన అద్భుతమైన సినిమాలను భద్రపరచటమే కాదు వాటి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉండేలా డిజిటల్ మ్యూజియమ్ ఏర్పాటు చేయబోతున్నాడట. ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు నాగ్. కాగా ప్రస్తుతం నాగార్జున బంగార్రాజు అనే సినిమాని చేస్తున్నాడు. ఇది సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్.. కళ్యాన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.