Shivaji Raja Resign : 'మా' సభ్యత్వానికి శివాజీరాజా రాజీనామా...!
Shivaji Raja Resign : నిన్న(ఆదివారం అక్టోబర్ 10 ) జరిగిన మా ఎన్నికల ఫలితాల్లో మంచు విష్ణు ప్యానెల్ ఎక్కువ మెజారిటీని సొంతం చేసుకుంది.;
Shivaji Raja Resign : నిన్న(ఆదివారం అక్టోబర్ 10 ) జరిగిన మా ఎన్నికల ఫలితాల్లో మంచు విష్ణు ప్యానెల్ ఎక్కువ మెజారిటీని సొంతం చేసుకుంది. ఆ ప్యానల్ నుంచి ఎక్కువ మంది గెలిచారు. మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత మా కి రాజీనామాల పర్వం మొదలైంది. ఫలితాలు వెలువడిన వెంటనే ముందుగా.. నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు. తాజాగా శివాజీ రాజా కూడా 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల ముందు మా ఎన్నికల పైన మాట్లాడిన ఆయన నటుడు నరేష్ పైన సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. నరేష్ కారణంగానే 'మా' ఎన్నికల్లో ఇంత రచ్చ జరుగుతోందని.. అతని వల్లే ఇన్ని విభేదాలంటూ కామెంట్స్ చేశారు శివాజీరాజా.