Jr. NTR : కరోనా నుంచి కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్ ..!
Jr. NTR : టాలీవుడ్ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు, ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.;
Jr. NTR : టాలీవుడ్ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు, ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నానని అన్నారు. నేను త్వరగా కోలుకోవాలని ఆశించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని తెలిపాడు.. అయితే కొవిడ్ చాలా ప్రమాదకరమైంది. కానీ దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. పాజిటివ్ ఆలోచనలతో జయించవచ్చనని తెలిపాడు. ఈ పోరాటంలో గెలిచేందుకు ధైర్యమే అతి పెద్ద ఆయుధమని ఆందోళన పపడవద్దని తెలిపాడు. ఇక ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి.. ఇంట్లోనే ఉండాలని సూచించాడు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో RRR అనే చిత్రాన్ని చేస్తున్నాడు.