Trisha : అందుకు మణిరత్నం నాకు వార్నింగ్ ఇచ్చారు : త్రిష
Trisha : పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో త్రిష ప్రముఖ పాత్ర పోషించింది;
Trisha : పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో త్రిష ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఐశ్వర్య కూడా అందులో మెయిన్ క్యారెక్టర్‌గా నటిస్తున్నారు. దర్శకుడు మణిరత్నం గురించి త్రిష ఇటీవళ జరిగిన ఇంటర్వూలో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. మణిరత్నం తనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు.
సినిమాలో ఐశ్వర్య, త్రిష క్యారెక్టర్లు ఒకరితో ఒకరు గొడవపడుతుంటారు. అయితే సెట్‌లో వీరిద్దరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ గడిపారట. అప్పుడు మణిరత్నం వచ్చి.. మీరిద్దరూ ఇలా స్నేహంగా ఉండవద్ద.. గొడవపడండి అని త్రిషకు చెప్పారని త్రిష ఇంటర్వూలో చెప్పింది. త్రిష, ఐశ్వర్య సెట్‌లో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది త్రిష. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.