బ్రేకింగ్..హైదరాబాద్‌లో సీరియల్ నటి ఆత్మహత్య
మౌనరాగం, మనసు మమత వంటి సీరియళ్లలో నటిస్తోన్న నటి ఆత్మహత్య;
టిక్‌టాక్‌లో పరిచయమైన ఓ యువకుడి వేధింపులు తట్టుకోలేక టీవీ సీరియల్ నటి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మధురానగర్‌లో చోటుచేసుకుంది. తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణికి టిక్‌టాక్‌లో దేవరాజ్‌రెడ్డి అనే యువకుడు పరిచయమయ్యాడు. అతని వేధింపులు భరించలేకే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అక్క చావుకు కారణం అయిన కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజ్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తమ్ముడు డిమాండ్ చేశాడు. గత ఎనిమిదేళ్ల నుంచి శ్రావణి టీవీ సీరియళ్లలో నటిస్తుంది. మౌనరాగం, మనసు మమత వంటి సీరియళ్లలో నటిస్తోంది.