posani krishna murali : పోసాని ఇంటిపై రాళ్ల దాడి..!
పోసాని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. అమీర్‌పేటలోని ఎల్లారెడ్డిగూడలో పోసాని ఇంటిపైకి అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లు విసిరారు;
పోసాని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. అమీర్‌పేటలోని ఎల్లారెడ్డిగూడలో పోసాని ఇంటిపైకి అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లు విసిరారు. పోసానిని బూతులు తిడుతూ వెళ్లిపోయారని వాచ్‌మెన్ దంపతులు చెబుతున్నారు. దాడిపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. గత మూడు రోజులుగా పవన్, పోసాని మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మొన్నటి ప్రెస్ మీట్‌లో పవన్ ఇంటి ఆడవారిపై సైతం అమర్యాదగా మాట్లాడాల్సి ఉంటుందంటూ మాట్లాడారు పోసాని. ఈ నేపధ్యంలో దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.