Upasana Konidela: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష మృతిపై ఉపాసన ట్వీట్.. కోపంగా ఉందంటూ..

Upasana Konidela: ఉపాసన కొణిదెల కూడా ప్రత్యూష మరణం గురించి ట్వీట్ చేశారు.

Update: 2022-06-12 09:35 GMT

Upasana Konidela: ఒక మనిషి అందరితో ఎంత నవ్వుతూ మాట్లాడినా.. తనలో ఏదో తెలియని బాధ ఉండవచ్చు. ఆ బాధ వారితో ఏమైనా చేయించవచ్చు. అందుకే ఆత్మహత్య లాంటి పెద్ద అడుగు వేయడానికి అయినా కొందరు వెనకాడరు. తాజాగా ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష మరణం చూస్తుంటే అదే అనిపిస్తోంది. మృతికి కారణాలు సరిగా తెలియకపోయినా.. తన సూసైడ్ నోట్ చూస్తుంటే ప్రత్యూష జీవితంలో ఏదో చెప్పుకోలేని బాధ దాగి ఉందని అర్థమవుతోంది. ఇక దీనిపై ఉపాసన కొణిదెల కూడా ట్వీట్ చేశారు.

పలు ఇండస్ట్రీల్లో ఉన్న సెలబ్రిటీలకు ప్రత్యూష ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసింది. చిన్న వయసులోనే తాను అనుకున్నవన్నీ సాధించింది. ఒక సక్సెస్‌ఫుల్ ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రత్యూష గరిమెళ్ల అనే పేరును బ్రాండ్‌గా మార్చుకుంది. 2013లో తన కెరీర్‌ను ప్రారంభించి అతికొద్ది సమయంలోనే మోస్ట్ వాంటెడ్ ఫ్యాషన్ డిజైనర్ అయిపోయింది. అలాంటి ప్రత్యూష మరణం ఒక్కసారిగా అందరిని షాక్‌కు గురిచేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆమె మృతిపై స్పందించారు.

ఉపాసన కొణిదెల కూడా ప్రత్యూష మరణం గురించి ట్వీట్ చేశారు. 'నా బెస్టీ, నా మంచి ఫ్రెండ్. తొందరగా వెళ్లిపోయింది. అందుకే బాధ, కోపం, దిగ్భ్రాంతిగా ఉంది. కెరీర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ.. ఇలా అన్నింటిలో తనకు అన్నీ బెస్ట్ ఉన్నాయి. అయినా డిప్రెషన్‌తో వెళ్లిపోయింది. ఈ సంఘటన తర్వాత మనసులో బరువు జీవితాంతం ఉండిపోతుంది అని నమ్ముతున్నాను. తనకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.' అని ప్రత్యూషతో దిగిన ఫోటోను షేర్ చేశారు ఉపాసన.


Tags:    

Similar News