పవన్ ఫ్యాన్స్‌కి బిగ్ సర్‌ఫ్రైజ్.. ఫస్ట్‌డే టికెట్స్ గెలుచుకునే ఛాన్స్
ట్రైలర్‌తోనే అదరగొట్టిన వకీల్.. ఫుల్ మూవీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాడని అభిమానులు సినిమాపై బోలెడు అంచనాలు పెట్టుకున్నారు.;
వకీల్ సాబ్ వచ్చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్‌కి ఇక పండగే.. ట్రైలర్‌తోనే అదరగొట్టిన వకీల్.. ఫుల్ మూవీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాడని అభిమానులు సినిమాపై బోలెడు అంచనాలు పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
బాలీవుడ్ 'పింక్' రీమేక్‌తో తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని పవన్ ఇమేజ్‌కి తగ్గకుండా వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని మలిచినట్లు చెప్పారు. యంగ్ స్టార్స్ ఎంత మంది వచ్చినా పవన్ ఎప్పుడూ పవర్ స్టారే ఫ్యాన్స్ దృష్టిలో. అందుకే ఆయన సినిమా కోసం అంతలా ఎదురు చూస్తారు.
మహిళా సాధికారతను ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్ర కథను తెరకెక్కించారు దర్శకుడు. ఇక మొదటి రోజు మొదటి ఆట.. అరుపులు, కేకలు, ఈలలు, గోలల మధ్య సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా అని పవన్ ఫ్యాన్స్ అనుకోవడం సహజం.
మరి ఈ అవకాశాన్ని మీరు దక్కించుకోవాలంటే హాయిగా, ఆరాంగా థియేటర్లో కూర్చుని వకీల్ సాబ్ ఫస్ట్ షో చూసెయ్యాలంటే ఈ రోజు (01.04.21) సాయింత్రం 6గం.లకు TV5 Tollywood Youtube Channel చూసెయ్యండి. ఫస్ట్‌డే, ఫస్ట్‌షో టికెట్ గెలుచుకునే ఛాన్స్ మీదే అవ్వొచ్చు.