'వేదం' నాగయ్య ఇక లేరు... !
వేదం సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు నాగయ్య మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శనివారం తుదిశ్వాస విడిచారు.;
వేదం సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు నాగయ్య మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ లోని సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా దేసవరం పేటకు చెందిన నాగయ్య.. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'వేదం' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలోని ఆయన నటనకి గాను ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అనంతరం నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్ సార్, ఏ మాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్ మొదలగు చిత్రాలలో నటించారు. కాగా ఇటీవలే ఆయన భార్య అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.. !