Vijay Devarakonda: సినిమా షూటింగ్‌లో ఏడ్చేసిన విజయ్.. ఎందుకంటే..?

Vijay Devarakonda: లైగర్ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో మూవీ టీమ్ ఒక్కొక్కటిగా అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉంది.

Update: 2022-07-12 14:00 GMT

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఎవరికీ భయపడని మనస్థత్వంతో.. ఉన్నది ఉన్నట్టు చెప్పే యాటిట్యూడ్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అంతే కాకుండా పర భాషా ఇండస్ట్రీల్లో కూడా విజయ్‌కు సెలబ్రిటీ ఫ్యాన్స్ ఉన్నారు. తాను హీరోగా నటిస్తున్న 'లైగర్' మూవీ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు దానికి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇక తాజాగా లైగర్ షూటింగ్‌లో తన అనుభవం గురించి ట్విటర్ ద్వారా బయపెట్టాడు విజయ్.

విజయ్ దేవరకొండ.. యూత్ సినిమాలతోనే తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. కనీసం ఒక్క బాలీవుడ్ సినిమా చేయక ముందే అక్కడ కూడా ఫేమ్ సంపాదించుకున్నాడు. అందుకే పూరీ జగన్నాధ్‌లాంటి డాషింగ్ డైరెక్టర్.. విజయ్‌తో పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. కోవిడ్ లాక్‌డౌన్ కంటే ముందు ప్రారంభించిన 'లైగర్' చిత్ర షూటింగ్ ఇప్పటికి చివరిదశకు చేరుకుంది.

లైగర్ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో మూవీ టీమ్ ఒక్కొక్కటిగా అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉంది. ఇటీవల ఇందులో నుండి మాస్ సాంగ్ 'అకిడి పకిడి'ని విడుదల చేసింది మూవీ టీమ్. ఇందులో విజయ్ డ్యాన్స్‌ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పటివరకు తాను చేసిన ఏ సినిమాలో కూడా విజయ్‌కు డ్యాన్స్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. అలాంటి తను మాస్ స్టెప్పులతో రెచ్చిపోయే సరికి ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. ఇక అకిడి పకిడి సాంగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేసుకున్న విజయ్.. 'కోరియోగ్రాఫీ చూసినప్పుడు ఏడ్చేశాను. కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం బ్లాస్ట్ చేశాను' అని ట్వీట్ చేశాడు.


Tags:    

Similar News