Vijayashanti on Balakrishna : నిప్పురవ్వ తర్వాత అందుకే బాలయ్యతో సినిమా చేయలేదు : విజయశాంతి
Vijayashanti on Balakrishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా హిట్ పెయిర్స్ ఉన్నాయి. అందులో బాలకృష్ణ, విజయశాంతి ఒకటి.. వీరి కాంబినేషన్ లో దాదాపుగా 17 సినిమాలు వచ్చాయి.;
Vijayashanti on Balakrishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా హిట్ పెయిర్స్ ఉన్నాయి. అందులో బాలకృష్ణ, విజయశాంతి ఒకటి.. వీరి కాంబినేషన్ లో దాదాపుగా 17 సినిమాలు వచ్చాయి. 'కథానాయకుడు' సినిమాలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించగా, 'నిప్పురవ్వ' చివరి చిత్రం.. ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వీరి ఖాతాలో ఉన్నాయి.
నిప్పురవ్వ చిత్రం తర్వాత విజయశాంతి, బాలకృష్ణ మధ్య విభేదాలు వచ్చాయని అందుకే ఇద్దరు కలిసి నటించలేదని అప్పట్లో న్యూస్ కూడా వైరల్ అయింది. తాజాగా దీనిపైన విజయశాంతి స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె మాట్లాడుతూ.. నిప్పురవ్వ చిత్రం తర్వాత తన రెమ్యునరేషన్ పెరిగిందని, ఇమేజ్ కూడా పెరగడం, హీరోయిన్ బేస్ సినిమాల పైన ఫోకస్ చేశానని అందుకే మళ్ళీ తమ కాంబినేషన్ లో సినిమా రాలేదని చెప్పుకొచ్చారు. అంతేతప్ప ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు.
కాగా నాయుడమ్మ సినిమా తర్వాత రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయిన విజయశాంతి.. 13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ చేస్తే ఓ యాక్షన్ సినిమాని చేయాలనీ ఉందని వెల్లడించారు.