Vijayendra Prasad: 'ఆయన ప్రధాని అయ్యుంటే ఇప్పటికి కశ్మీర్ పరిస్థితి వేరేలా ఉండేది'..

Vijayendra Prasad: విజయేంద్ర ప్రసాద్ ఏం అనిపిస్తే అది మాట్లాడేస్తారు. అప్పుడప్పుడు దాని వల్ల కాంట్రవర్సీలు తలెత్తుతాయి.

Update: 2022-07-10 11:20 GMT

Vijayendra Prasad: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ఆర్ఆర్ఆర్ ప్రోమో సాంగ్ అయిన ఎత్తర జెండాలో మహాత్మ గాంధీతో ఫోటో లేకపోవడంపై ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవల మూవీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ విషయంపై కాస్త ఘాటుగానే స్పందించారు. ఆయన కావాలనే పెట్టలేదని, దాని వెనుక ఉన్న కారణాన్ని చెప్పుకొచ్చారు.

విజయేంద్ర ప్రసాద్.. తనకు ఏం అనిపిస్తే అది మాట్లాడేస్తారు. అప్పుడప్పుడు దాని వల్ల కాంట్రవర్సీలు కూడా తలెత్తుతాయి. అలా ఓ పాత ఇంటర్వ్యూలో ఆయన చేసిన కొన్ని స్టేట్‌మెంట్స్ మరోసారి కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. మహాత్మ గాంధీ వల్లే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని కాలేదని అన్నారు విజయేంద్ర ప్రసాద్. కాంగ్రెస్ పార్టీలో పటేల్‌కే మద్దతు ఎక్కువగా ఉన్నా.. గాంధీ వల్లే జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాని అయ్యారని అన్నారు. ఒకవేళ పటేల్ ప్రధాని అయ్యింటే జమ్మూ కశ్మీర్ తలరాత ఇప్పుడు వేరేలా ఉండేదని తెలిపారు.

అప్పట్లో ఇండియాలో 17 మంది పీసీసీలు ఉండేవారని చరిత్రను మరోసారి గుర్తుచేశారు విజయేంద్ర ప్రసాద్. అందులో 15 మంది పటేల్ ప్రధాని కావాలని కోరుకున్నారని తెలిపారు. కానీ గాంధీ కారణంగానే నెహ్రూ ప్రధాని అయ్యారని అన్నారు. అంతే కాకుండా గాంధీ.. తన ప్రాణం ఉన్నంత వరకు పటేల్.. ప్రధాని పదవి కోసం ఆశపడకూడని మాట తీసుకున్నారని తెలిపారు. నెహ్రూ ప్రధాని అయినప్పుడు కశ్మీర్‌ను కాపాడతానని మాటిచ్చారని, కానీ కశ్మీర్ ఇప్పటికీ అలాగే రగులుతుందని తెలియజేశారు విజయేంద్ర ప్రసాద్. ఆయన మాటలను కొందరు నెటిజన్లు సమర్థిస్తుంటే.. కొందరు విమర్శిస్తున్నారు.


Tags:    

Similar News