Virupaksha Trailer: ఆసక్తిరేకెత్తిస్తోన్న విరూపాక్ష ట్రైలర్
సాయిధరమ్ తేజ్ - సంయుక్త జంటగా విరూపాక్ష;
ఎనర్జిటిక్ హీరో సాయిధరమ్ తేజ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆకట్టుకునే పాటలతో, ఇంట్రెస్టింగ్ టీజర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన విరుపాక్ష త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈరోజే ట్రైలర్ రిలీజ్ అవ్వగా దానికి మంచి స్పందన లభిస్తోంది. ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన విరూపాక్ష ఫుల్ టూ పైసా వసూల్ అన్న సంగతి ఇట్టే అర్ధమైపోతోంది. సాయిధరమ్ తేజ్ తో పాటూ, హీరోయిన్ సంయుక్తకూ మంచి పాత్రలే లభించాయి. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కార్తిక్ దండు దర్శకత్వం వహించాడు. ఏమైనా మొత్తానికి సినిమా ఎప్పుడు విడుదలవుతోందా అని జనాల్లో గట్టిగానే క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. మరి తేజ్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయఢంగా మోగిస్తాడేమో చూడాలి.