Bheemla Nayak : భీమ్లానాయక్ సినిమాలో 'అడవితల్లి పాట' పాడిన ఈ ఫోక్ సింగర్ ఎవరంటే?
Bheemla Nayak : పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'భీమ్లానాయక్'.. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, కథనం అందిస్తున్నారు.;
Bheemla Nayak : పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'భీమ్లానాయక్'.. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, కథనం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా జనవరి 12న సినిమాని రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ చేశారు.
తాజాగా అడవితల్లి అంటూ నాలుగో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి కలిసి ఆలపించారు. ఈ పాటలో సాంగ్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ఫోక్ సింగర్ ఎవరా అని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెడుతున్నారు. కుమ్మరి దుర్గవ్వపక్కా ఫోక్ సింగర్.. అమెది మంచిర్యాల జిల్లా.. ఏం చదువుకోలేదు.. పంటపనులకి పోయినప్పుడు అక్కడే పాట పాడడం నేర్చుకుందట.
కుమ్మరి దుర్గవ్వ తెలుగులోనే కాదు మరాఠీ బాషలో కూడా పాటలు పాడతారు. ఇప్పటికే ఆమె పాడిన ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే, సిరిసిల్లా చిన్నది మొదలుపాటలకి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు భీమ్లానాయక్ సినిమాలో పాట పాడే ఛాన్స్ కొట్టేసింది.