'సీటీమార్'లో ఈ ఆంధ్రా కబడ్డీ కెప్టెన్ ఎవరో తెలుసా?
Preethi Asrani : గోపీచంద్ హీరోగా వచ్చిన తాజా చిత్రం సీటీమార్.. తమన్నా హీరోయిన్‌గా నటించింది.;
Preethi Asrani : గోపీచంద్ హీరోగా వచ్చిన తాజా చిత్రం సీటీమార్.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. వినాయకచవతి సందర్భంగా(సెప్టెంబర్ 10న )ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాగా ఆకట్టుకుంది. ఇందులో గోపీచంద్ ఆంధ్రా కోచ్‌గా నటించగా, తమన్నా తెలంగాణ కోచ్‌గా నటించి మెప్పించింది. వీరితో పాటుగా కబడ్డీ టీంలో కొంతమంది అమ్మాయిలు సినిమాలో కీలకపాత్ర పోషించారు. అందులో ఆంధ్రా కబడ్డీ టీం కెప్టెన్‌గా నటించి ఆకట్టుకుంది ప్రీతి ఆస్రాని. సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి.
ప్రీతి ఆస్రాని గుజరాత్‌లో సెప్టెంబర్ 7 1999లో జన్మించింది. ఆమె తండ్రి బిజినెస్‌మెన్ కాగా, తల్లి హౌజ్ వైఫ్.. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం ఉండడంతో ఆమె హైదరాబాదుకి షిఫ్ట్ అయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్ బాషలలో అనర్గళంగా మాట్లాడుతుంది ప్రీతి ఆస్రాని. ఆమె సోదరి అంజు ఆస్రాని కూడా నటి కావడం విశేషం. ప్రీతి ఆస్రాని పదహారేళ్ళ వయసులో మొదటిసారిగా ఫిదా అనే షార్ట్ ఫిలింలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక అక్కినేని సుమంత్ హీరోగా వచ్చిన మళ్ళీరావా సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించింది.
మొదటిసినిమాతోనే అందర్నీ ఆకర్షించిన ప్రీతి ఆస్రాని.. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, ప్రెషర్ కుక్కర్ సినిమాలలో నటించింది. మళ్ళీ గోపీచంద్ సినిమా సీటీమార్ చిత్రంలో అవకాశం వచ్చింది. సినిమాలోనే కాకుండా సీరియల్స్ లలో కూడా నటించింది ఈ భామ. జీ తెలుగులో పక్కింటి అమ్మాయి అనే సీరియల్ ఆమె కెరీర్‌కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండడం విశేషం.