East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో వింత.. మనిషి ముఖాన్ని పోలిన చేప..
East Godavari: తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మనిషిని పోలిన చేప ప్రత్యక్షమైంది.;
East Godavari: తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మనిషిని పోలిన చేప ప్రత్యక్షమైంది. ఉప్పలగుప్తం మండలం వాసాల తిప్ప వద్ద మత్స్యకారుల వలకు వింత చేప చిక్కింది. మనిషి మోమును పోలిన అరుదైన ఈ మీనాన్ని బొంక చేపని పిలుస్తారు. దీన్ని పఫర్ ఫిష్, బెలూన్ ఫిష్, గ్లోబ్ ఫిష్‌అని కూడా అంటారు. ఇది సాధారణంగా మామూలు చేపలాగే ఉంటుంది. ఎవరైనా తాకినా.. ప్రమాద సంకేతాలు కనిపించినా గాలిపీల్చుకొని బంతిలా మారిపోతుంది. టెట్రాంటిడి కుటుంబానికిచెందిన దీని శాస్త్రీయనామం టెట్రాడాన్ అని మత్స్యశాఖ అధికారి గోపాల కృష్ణ తెలిపారు. ప్రపంచంలోకెళ్ల రెండో విషపూరితమైన ఈ బెలూన్ ఫిష్ అన్నారు. దీనిలో మనిషిని చంపేంత విషం ఉంటుందన్నారు.