Karnataka : 6 నెలల వయసులో చిన్నారి అరుదైన రికార్డు

Update: 2025-07-29 09:30 GMT

 కర్ణాటకలోని కంప్లికి చెందిన ఆరు నెలల చిన్నారి ద్వితా మోహన్ ఒక అరుదైన రికార్డును సృష్టించింది. ఈ చిన్నారి ఎవరి సహాయం లేకుండా 44 నిమిషాల 8 సెకన్ల పాటు కూర్చొని వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. సాధారణంగా ఆరు నెలల వయసున్న పిల్లలు అంతసేపు ఎవరి సాయం లేకుండా కూర్చోవడం చాలా అరుదు. మహా అయితే 5 లేదా 10 నిమిషాలు మాత్రమే కూర్చోగలరు. కానీ ద్వితా మోహన్ అటు ఇటు కదలకుండా ఒకే చోట అంతసేపు కూర్చొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిన్నారి కంప్లికి చెందిన లాయర్ మోహన్‌కుమార్ దానప్ప, సౌమ్యశ్రీ దంపతుల రెండో కుమార్తె. ఈ అరుదైన ఘనతతో ద్వితా మోహన్ పేరు ఇప్పుడు వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నిలిచింది.

Tags:    

Similar News