రంగురంగులతో ఆకట్టుకునే బిర్యానీ.. దాని వెనుక అసలు కథ తెలిస్తే తినాలంటేనే భయపడుతారు..!
బిర్యానీ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఎవరైనా సరే బిర్యానీ అంటే లోట్టలేస్తారు. రంగురంగులతో కనిపించే బిర్యానీ చూస్తే ఇట్టే అట్రాక్ట్ అవుతారు.;
బిర్యానీ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఎవరైనా సరే బిర్యానీ అంటే లోట్టలేస్తారు. రంగురంగులతో కనిపించే బిర్యానీ చూస్తే ఇట్టే అట్రాక్ట్ అవుతారు. అయితే బిర్యానీలో కనిపించే కలర్స్ వెనుకన్న నిజం తెలిస్తే మరోసారి బిర్యానీ తినాలంటేనే భయపడిపోతారు. హైదరాబాద్, విజయవాడ మొదలగు పట్టణాల్లో దొరికే బిర్యానీ ఆకర్షణీయంగా కనిపించేందుకు సింథటిక్ రంగులను అధికంగా వాడుతున్నారు కొందరు హోటల్ నిర్వాహకులు. వీటి వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి మరి అధికంగా ఎసెన్సులు, ఇతర రంగులను వాడుతున్నారు. ఇటీవల ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు హోటల్స్, సూపర్ మార్కెట్‌లు, బేకరీల్లో నిర్వహిస్తున్న ఆకస్మిక దాడుల్లో విచ్చలవిడి రంగుల వాడకం బయట పడింది. దీనితో అధికారులు వారిపైన చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా పలు చోట్లల్లో చికెన్, మటన్, రొయ్యలు ఎక్కువ రోజులు డీప్ ఫ్రిజ్‌లో ఉంచి వాడుతున్నట్టుగా బయటపడింది. ఇలా నిల్వ మాసం తింటే అజీర్తి సమస్యలు, ముఖ్యమైన అవయవాలు పనిచేయకపోవటం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చేపుతున్నారు.