Vande Bharat : వందే భారత్ రైలులో ఆర్డర్ చేసిన ఫుడ్ లో బొద్దింక

Update: 2024-02-10 12:16 GMT

ఫిబ్రవరి 1న రాణి కమలపాటి నుండి జబల్‌పూర్‌కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో (Vande Bharat) ప్రయాణించిన ఒక ప్రయాణికుడు తన ఆహారంలో చనిపోయిన బొద్దింక కనిపించిందని ఆరోపించాడు. జబల్‌పూర్ రైలు స్టేషన్‌లో దిగిన తర్వాత అతను పశ్చిమ మధ్య రైల్వేకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి రెండు రోజుల తర్వాత Xలోనూ ఘటనను నివేదించాడు. ఈ ట్వీట్‌కు ప్రతిస్పందనగా, IRCTC అతనికి క్షమాపణలు చెప్పింది.

“నేను 1/02/2024 రైలు నెం. 20173 RKMP నుండి JBP (వందే భారత్ ఎక్స్‌ప్రెస్)లో ప్రయాణించాను. వారు ఇచ్చిన ఆహార ప్యాకెట్‌లో చనిపోయిన బొద్దింకను చూసి నేను ఆందోళనకు గురయ్యాను" అని డాక్టర్ శుభేందు కేశరి Xలో కొన్ని చిత్రాలను పంచుకుంటూ రాశారు. జబల్‌పూర్‌లోని పశ్చిమ మధ్య రైల్వేలో డాక్టర్ కేశరి దాఖలు చేసిన అధికారిక ఫిర్యాదు మొదటి చిత్రంలో ఉంది. అతను తన ఫిర్యాదులో సాక్షిగా రాజేష్ శ్రీవాస్తవ అనే మరో ప్రయాణికుడిని చేర్చాడు. అతను ఆర్డర్ చేసిన నాన్ వెజిటేరియన్ థాలీలో చనిపోయిన బొద్దింక మిగిలిన ఫొటోలలో కనిపించింది.

"సర్, మీకు ఎదురైన అనుభవానికి క్షమాపణ కోరుతున్నాం" అని ప్రయాణీకుడి వైరల్ ట్వీట్‌కు ప్రతిస్పందనగా IRCTC రిప్లై. సమస్యను తీవ్రంగా పరిగణించినందున సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌కు భారీ జరిమానా విధించింది. ఇది ఫిబ్రవరి 3న ట్వీట్ చేయబడింది. అప్పటి నుండి దీనికి 41.4లక్షల వ్యూస్ రాగా.. వేలల్లో లైక్స్, కామెంట్‌లు కూడా వచ్చాయి.

Tags:    

Similar News