Police Constable : మామూళ్లు ఇవ్వలేదని లారీ డ్రైవర్ పై కానిస్టేబుళ్ల దాడి

Update: 2024-03-22 09:48 GMT

మామూళ్లు ఇవ్వలేదని ఇసుక లారీ డ్రైవర్ పై దాడి చేసి కానిస్టేబుళ్లు బట్టలూడదీసి కొట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గోదావరి నుంచి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మీదుగా ఇసుక లారీలను లారీ డ్రైవర్లు తీసుకువస్తున్నారు. లారీ ఆపాలని పోలీసులు సూచించినా డ్రైవర్ భయపడి లారీని ముందుకు తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు వెంబడించి లారీ ఆగిన తర్వాత డ్రైవర్ ని కిందికి దించారు.

పరిమితికి మించి లోడ్ తీసుకెళు తున్నారని మాముళ్లు ఇవ్వాలంటూ లారీ డ్రైవర్ ను ఇద్దరు కా నిస్టేబుల్స్ బెదిరించారు. ఈక్రమంలో వారి మధ్య వాగ్వాదం జరగడంతో డ్రైవర్ పై కానిస్టేబుల్స్ దాడి చేశారు. నడిరోడ్డుపై బట్టలు విప్పి పోలీస్ కానిస్టేబుల్స్ చితకబాదారు. అక్కడున్న వారు వీడియో తీసి అందరికీ పంపడంతో వైరల్ గా మారి కానిస్టే బుళ్ల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రతిరోజూ రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ వసూళ్లకు పాల్ప డుతున్నట్టు పోలీస్ కానిస్టేబుల్స్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని, విచారణ చేసి పై అధికారులకు నివేదిక అందించినట్లు ఎస్సై వంశీధర్ తెలిపారు.

Tags:    

Similar News