CPR Saves Life : సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ

Update: 2024-02-19 05:38 GMT

కుటుంబ సమస్యలు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు వదలాలని నిశ్చయించుకున్నాడు. ఈమేరకు సమాచారం అందింన వెంటనే ఎస్ఐ బాధితుడిని ఉరి నుంచి కిందకు దించాడు. కానీ బాధితుడిలో

చలనం లేదు. వెంటనే సమయస్ఫూర్తితో ఆలోచించిన ఎస్ఐ అతడికి సీపీఆర్ చేసి బాధితుడికి ప్రాణాలు పోశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

బెంగాల్ కు చెందిన సంతోష్ ముఖర్జీ(38) (Santosh Mukherjee) ఇబ్రహీంపట్నంలోని (Ibrahimpatnam) ఓ కన్స్ట్రక్షన్ సంస్థలో పనిచేస్తున్నాడు. కాగా కొన్ని రోజులుగా అతడు కుటుంబ సమస్యలతో మానసికంగా తీవ్ర వేదనకు గురయయ్యాడు. దాంతో శనివారం ఏంచేయాలో తెలియన అతడు పనిచేసే సంస్థకు దగ్గర్లోనే ఉన్న అటవీ ప్రాంతంవైపు వెళ్లాడు. అది గమనించి తోటి కూలీలు అటుగా పోలీసు వాహనంలో వచ్చిన ఎస్ఐ మైబెల్లికి విషయం చెప్పారు.

దాంతో అనుమానం రావడంతో ఎస్ఐ ఆ చుట్టపక్కల గాలింపు చేపట్టారు. సంతోష్ కోసం వెతుకుతుండగా ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే స్పందించిన ఎస్ఐ అతడిని దింపి శ్వాస ఆడకపోవడంతో సీపీఆర్ చేశాడు. కొద్దిసేపటికి సంతోష్ స్పృహలోకి రావడంతో అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా సరైన సమయంలో సమయస్ఫూర్తితో ప్రవర్తించి ఒకరి ప్రాణం కాపాడినందుకు సదరుఎస్ఐని అందరూ ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News