కోర్టులో విడాకుల కేసు.. సింగర్‌తో స్టార్ హీరో చెట్టాపట్టాల్.. నెటిజన్ల విమర్శలు..
నటీనటుల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ అందరి దృష్టిలో ఉంటాయి. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, అతని భార్య ఆర్తి మధ్య విడాకుల వివాదం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో జయం రవి, గాయని కెనిషా ఫ్రాన్సిస్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జయం రవి, కెనిషా ఫ్రాన్సిస్ లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ జంటగా ఆలయానికి వెళ్లి స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు జయం రవిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. "భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం కెనిషాతో తిరగడమేనా?" అంటూ ప్రశ్నిస్తున్నారు.
జయం రవి, ఆర్తి లకు ఇద్దరు కుమారులు ఉండగా వీరి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. జయం రవి తరచుగా తన భార్యపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, ఆర్తి భరణం కింద రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాదాల మధ్య జయం రవి, కెనిషా మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లను జయం రవి ఖండించారు. తాము కేవలం స్నేహితులం అని స్పష్టం చేశారు. కానీ, ఆర్తి మాత్రం జయం రవి, కెనిషా సంబంధం వల్లే విడాకులు ఇస్తున్నారని ఆరోపించారు.
కాగా జయం రవి త్వరలో సొంతంగా ఒక నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నారని, దాని ప్రారంభోత్సవానికి ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు వెళ్లారని టాక్ నడుస్తోంది. కెనిషా కూడా ఈ ప్రొడక్షన్ హౌస్‌లో భాగస్వామిగా ఉండవచ్చని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా జయం రవి త్వరలో సొంతంగా ఒక నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నారని, దాని ప్రారంభోత్సవానికి ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు వెళ్లారని టాక్ నడుస్తోంది. కెనిషా కూడా ఈ ప్రొడక్షన్ హౌస్‌లో భాగస్వామిగా ఉండవచ్చని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై జయం రవి గానీ, కెనిషా గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చూడాలి మరి వీరి వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో...