Ganja Packets : తోటలో గంజాయి ప్యాకెట్లు...కంగుతిన్న రైతు..

Update: 2025-07-07 11:00 GMT

పొలంలో పనిచేస్తున్న ఓ రైతుకు భూమిలో అనుమానాస్పద ప్యాకెట్లు లభించాయి. వీటిని పరిశీలించగా అవి గంజాయి ప్యాకెట్లని తేలింది. దీంతో కంగు తన్న ఆ రైతు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దమ్మపేట మండలం అఖినేపల్లి రెవెన్యూ పరిధిలోని అచ్యుతాపురం గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది.

తన పామాయిల్ తోటలో రోజు వారి పనులు చేసుకోవడానికి వెళ్ళాడు ఓ రైతు. కాలువ పనులు చేస్తున్న సమయంలో ఏవో ప్యాకెట్లు కనిపించాయి. ముందుగా చెత్త అనుకున్న ఆ రైతు పెద్దగా పట్టించుకోలేదు. అయితే తవ్వుతున్న కొద్ది మరిన్ని ప్యాకెట్లు దొరకడంతో అనుమానం వచ్చిన ఆ రైతు వెంటనే అశ్వరావుపేట పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాటిని పరిశీలించి అవి గంజాయి ప్యాకెట్లుగా తేల్చారు . అయితే పామాయిల్ తోట దమ్మపేట మండల పరిధిలో ఉండటంతో అక్కడి ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డికి సమాచారం అందించారు. మొత్తం 44 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని.. గంజాయి ఎవరు దాచారు? ఎక్కడి నుంచి తెచ్చారు? అన్న కోణాల్లో విచారణ చేపట్టామని ఎస్సై తెలిపారు. కాగా గంజాయి ప్యాకెట్లను దమ్మపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.

Tags:    

Similar News