ప్రజలలో చికెన్ పై అపోహలు, భయాలు తొలగించేందుకు పౌల్ట్రీ వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆలేరు పట్టణంలో వెన్ కాబ్ సంస్థ ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించింది. వెంకటేశ్వర హాచరీస్ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 200 కేజీల చికెన్, 2వేల కోడిగుడ్లు ఉచితంగా పంపిణీ చేసింది. ఫ్రీ చికెన్ తినేందుకు ఆలేరు వాసులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఆ ప్రభావంతో పౌల్ట్రీ రంగం బాగా నష్టపోతోందని సంస్థ తెలిపింది. 70 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత వద్ద చికెన్ వండి తింటే ఎలాంటి వైరస్ సోకదని ప్రపంచ ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయని తెలిపింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రీ చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించామంటోంది. .