Coimbatore : రూపాయి నాణేలతో భార్యకు భరణం

Update: 2024-12-21 06:15 GMT

రూపాయి నాణేలతో వాహనాలు కొనుగోలు చేశారనే వార్తలు కామన్. కానీ, తమిళనాడు లోని కోయంబత్తూరుకు చెందిన ఓ టాక్సీ డ్రైవర్ తన భార్యకు ఇవ్వాల్సిన భరణంలో కొంత మొత్తాన్ని నాణేలతో చెల్లించేందుకు యత్నించి వార్తల్లోకెక్కాడు. కోర్టుకు అతను 20 బ్యాగుల్లో రుపాయి నాణేలు తీసుకొచ్చారు. అతని భార్య విడాకుల కోసం కోర్టుకెళ్లగా రూ.2లక్షలు భరణం చెల్లించాలని ఆదేశించింది. వాటిలో రూ.80వేలు నాణేలతో చెల్లించాలనుకుంటే కోర్టు అనుమతించలేదు.

భరణం అనేది విడాకుల తర్వాత ఆర్థిక మద్దతు కోసం ఒక జీవిత భాగస్వామి మరొకరికి చెల్లించాల్సిన పరిహారం. అందుకే విడాకుల కోసం దావా వేసే స్త్రీలు తమ భర్తలను భరణం అడగడం పరిపాటి. చాలా మంది మహిళలు తమ పిల్లలను పోషించడానికి, తమని తాము చూసుకోవడం కోసం భరణాన్ని కోరతారు. అలాగే విడాకులు తీసుకున్న మహిళలు పిల్లల అవసరాలను తీర్చడానికి వారి భర్తల నుంచి అధిక మొత్తంలో భరణాన్ని నెలవారీ మొత్తంగా పొందుతున్నారని గుర్తించారు.

Tags:    

Similar News