అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం వైసీపీలో అసమ్మతి సెగ భగ్గుమంది. ప్రజా ప్రతినిధులు తమకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని వైసీపీలోని అసంతృప్తివాదులు అల్లవరం మండలం గుడ్డివాని చింత సమీపంలో సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీకి తొలి నుంచి జెండా మోసినప్పటికి తమను మంత్రి కరివేపాకులా తీసివేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ పార్టీ జెండాకే తాము కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సైతం తమకు పాస్ లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.