టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్-లావణ్య వ్యక్తిగత జీవితం వివాదం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రచ్చకు నార్సింగి పోలీసుల జోక్యంతో కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు పోలీసుల ఎంట్రీతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులను లావణ్య ఇంట్లోకి చేర్చుకుంది. అయితే లావణ్య తమ కోడలు కాదంటున్నారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. రాజ్ తరుణ్ తో కేవలం సహజీవనం మాత్రమే చేసింది తప్పా...తన కొడుకు వివాహం చేసుకోలేదంటున్నారు. కోకాపేట్ లో ఉన్న విల్లా రాజ్ తరుణ్ ది...అందుకే తమ కొడుకు ఇంట్లో తాము ఉంటున్నామంటున్నారు తల్లిదండ్రులు.