మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు నటుడు మోహన్‌బాబుపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆయనపై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే నిన్న ఆయనకు నోటీసులు జారీ చేసిన రాచకొండ పోలీసులు ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే నిన్న తీవ్ర ఘర్షణ తర్వాత మోహన్‌బాబు ఆసుపత్రిలో చేరారు. దీంతో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా తన ఇంట్లో జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో ఆయన టెన్షన్‌కు గురైనట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ జల్‌పల్లిలో మోహన్‌బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రేపు ఉదయం విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.