తాగుబోతు భర్తలతో విసిగి వేసారిన ఇద్దరు మహిళలు ఇండ్లు వదిలి వెళ్లి పెండ్లి చేసుకున్నారు. కవిత, గుంజా అలియాస్ బబ్లూ అనే ఇద్దరు అతివలు డియో రియాలోని చోటీ కాశీ శివాలయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాము మొదట ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అయ్యామని, సిమిలర్ పరిస్థితుల వల్ల మరింత దగ్గరయ్యామని వారు విలేకరులకు తెలిపారు. ఆలయంలో, గుంజా వరుడి పాత్రను ధరించి, కవితకు సిందూర్ (వె ర్మిలియన్) పూసి, ఆమెతో దండలు మార్చుకుని, ఏడడగులు వేశారు. తాగుబోతులైన తమ భర్తల అసభ్య ప్రవర్తన, హింసకు తాము బాధితుల మని చెప్పుకొచ్చారు. తాము శాంతి, ప్రేమతో కూడిన వివాహాన్ని ఎంచుకొనే ఒక్కటయ్యామ ని అన్నారు. గోరఖ్ పూర్ లో జీవించాలని నిర్ణ యించుకున్నట్టు తెలిపారు. ఒకే గదిని అద్దెకు తీసుకొని వివాహిత జంటగా ఉంటామని చెప్పారు. ఆలయ పూజారి ఉమాశంకర్ పాండే మాట్లాడుతూ మహిళలు దండలు మార్చుకొని మహాశివుడి సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారని చెప్పారు.